వరి సాగులో యాంత్రీకరణ అవసరం ఎంతో వుంది- డా. ప్రవీణ్‌రావు
ABN , First Publish Date - 2021-02-12T23:19:53+05:30 IST
వరి సాగులో యాంత్రీకరణ అవసరం ఎంతో ఉందని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ డా. ప్రవీణ్‌రావు అన్నారు.
హైదరాబాద్: వరి సాగులో యాంత్రీకరణ అవసరం ఎంతో ఉందని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ డా. ప్రవీణ్‌రావు అన్నారు. వరినాట్ల నుంచి కోత వరకు అనేక పనులలో యాంత్రీకరణ చేపట్టాల్సి ఉందన్నారు. కూలీల కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వరిలో డైరెక్ట్ సీడింగ్ పద్దతిలో సాగుకు సంబంధించి ప్రాణధార ఫౌండేషన్ ప్రతినిధులతో శుక్రవారం సమావేశమయ్యారు. తడి. పొడి పొలాల్లో డైరెక్ట్ సీడింగ్ (వెదజల్లే)పద్దతి గురించి వారు వైస్‌ఛాన్సలర్‌కు వివరించారు. గుంటూరు , కృష్ణాజిల్లాల్లో ప్రాఽణధార ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న ఈ విధానాన్ని , వాటి ఫలితాలను వారు డా. ప్రవీణ్‌రావుకు వివరించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత భూములు, పరిస్థితులకనుగుణంగా డైరెక్ట్ సీడింగ్ ఏ మేరకు ఉపయోగ పడుతుందన్న అంశాలపై వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాణధార ఫౌండేషన్ ప్రతినిధులు చర్చించి ఓ కార్యాచరణ రూపొందించాలని వైస్‌ఛాన్సలర్ సూచించారు. ఈ సమావేశంలో పరిశోధనా సంచాలకులు డా. జగదీశ్వర్, విశ్వ విద్యాలయ ఉన్నతాధికారులు, వరి పరిశోధనా శాస్త్రవేత్తలు, ప్రాణధార ఫౌండేషన్ ప్రతినిధి పుండరీకాంక్షులు తదితరులు పాల్గొన్నారు.