విమాన ఛార్జీల పెంపు... అమలులోకి...

ABN , First Publish Date - 2021-06-01T21:43:06+05:30 IST

డొమెస్టిక్ విమాన ప్రయాణ ఛార్జీలు పెరిగాయి. ఈ రోజు(మంగళవారం) నుంచే ఇవి అమ్లల్లోకొచ్చాయి.

విమాన ఛార్జీల పెంపు...  అమలులోకి...

న్యూఢిల్లీ : డొమెస్టిక్ విమాన ప్రయాణ ఛార్జీలు పెరిగాయి. ఈ రోజు(మంగళవారం) నుంచే ఇవి అమ్లల్లోకొచ్చాయి. దేశీయ ప్రయాణాలకు సంబంధించి లోయర్ లిమిట్‌ను 15 శాతం పెంచుతున్నట్టు భారత విమానయాన శాఖ కిందటి నెల 29 వ తేదీన ప్రకటించింది. కరోనా నేపథ్యంలో... ప్రయాణికుల విమానాల్లో  రద్దీ తగ్గినందున  విమానయాన సంస్థలకు నష్టాలొస్తున్నాయని ఆ శాఖ ఈ సందర్భంగా వెల్లడించింది. . విమానయాన సంస్థల పరిస్థితిని కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ పరిస్థితిని మరింత దిగజార్చిందని పేర్కొంది. 


ఎయిర్‌లైన్స్ సంస్థలను కష్టాల నుంచి గట్టెక్కించడానికే ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నలభై నిమిషాల కంటే తక్కువ ప్రయాణ సమయం ఉండే ప్రయాణాల ఛార్జీలను 13 శాతం(రూ.  2,300 నుంచి రూ. 2,600 కు పెంచుతున్నట్టు విమానయాన శాఖ తెలిపింది.ఈ ప్రయాణాలకు గరిష్ఠ ధర మాత్రం రూ. 7,800 కు మించబోదని వెల్లడించింది. ఇక... 40-60 నిమిషాల ప్రయాణాల ఛార్జీని రూ. 2,900 నుంచి రూ. 3,300 కు పెంచినట్టు తెలిపింది. అలాగే... గరిష్ఠ క్యూఎఫ్ ఛార్జీ రూ. 9,800కు మించబోదని వెల్లడించింది. 

Updated Date - 2021-06-01T21:43:06+05:30 IST