Abn logo
Jun 14 2021 @ 19:34PM

జియోకు ఎయిర్‌టెల్ సవాల్.. 5జీ ట్రయల్స్‌లో దశలోనే 1జీబీపీఎస్

న్యూఢిల్లీ: 5జీలో రిలయన్స్ జియోను ఎదుర్కొనేందుకు భారతీ ఎయిర్‌టెల్ సిద్ధమైంది. గురుగ్రామ్‌లో 5జీ ట్రయల్‌ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. 5జీ ట్రయల్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నెల రోజుల్లోనే ఎయిర్‌టెల్ రంగంలోకి దిగడం గమనార్హం. పరీక్ష దశలో ఉండగానే ఎయిర్‌టెల్ గరిష్టంగా 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను ఆఫర్ చేస్తోంది.


గురుగావ్ సైబర్‌హబ్‌లో ఇప్పుడు 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది. స్వీడన్ ఎక్విప్‌మెంట్ మేకర్ అయిన ఎరిక్‌సన్‌తో కలిసి ఎయిర్‌టెల్ ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. త్వరలోనే ముంబైలోనూ 5జీ ట్రయల్స్ నిర్వహించాలని ఎయిర్‌టెల్ యోచిస్తోంది. 

5జీ నెట్‌వర్క్ పరీక్షల దశలోనే ఎయిర్‌టెల్ 1జీబీపీఎస్ వేగాన్ని ఇవ్వనుంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న 4జీ నెట్‌వర్క్‌కు అందుతున్న దానికంటే చాలా వేగవంతమైనది. ఊక్లా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ వేగంలో భారత్ 130వ స్థానంలో ఉంది.


దేశంలో సగటు డౌన్‌లోడ్ వేగం 12.81 ఎంబీపీఎస్ కాగా, అప్‌లోడు వేగం 4.79 ఎంబీపీఎస్. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియాలకు 5జీ ట్రయల్స్‌కు గత నెలలో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.