‘ఎక్స్‌ట్రీం’ యూజర్లకు ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్

ABN , First Publish Date - 2020-08-15T02:39:29+05:30 IST

ఎక్స్‌ట్రీం ఫైబర్ హోం బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్

‘ఎక్స్‌ట్రీం’ యూజర్లకు ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్

న్యూఢిల్లీ: ఎక్స్‌ట్రీం ఫైబర్ హోం బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కొత్త కనెక్షన్ తీసుకున్న వారికి అదనంగా 1000 జీబీ డేటాను ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇండిపెండెన్స్ డే ఆఫర్‌లో భాగంగా పరిమిత కాలం పాటు అన్ని ఎక్స్‌ట్రీం ఫైబర్ ప్లాన్లపైనా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అలాగే, దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లోనూ ఇది అందుబాటులో ఉంటుందని ఎయిర్‌టెల్ వివరించింది. నెలకు రూ. 799 కనీస ప్లాన్‌తో అందుబాటులో ఉన్న దీంట్లో 12 నెలలపాటు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీం కంటెంట్ ప్లస్ వింక్ మ్యూజిక్ వంటి ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు లభిస్తాయి.


ఎయిర్‌టెల్ తాజా ఆఫర్ అన్‌లిమిటెడ్ డేటా, ప్రీపెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లకు వర్తించదు. అలాగే, 1000 జీబీ అదనపు డేటా ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా 1జీబీపీఎస్ వేగంతో డేటా లభిస్తుంది.

Updated Date - 2020-08-15T02:39:29+05:30 IST