రూ. 356 కోట్లతో అక్షయ్‌ ఒక్కడే

ABN , First Publish Date - 2020-12-20T05:30:00+05:30 IST

సినిమా రంగంలో ఫోర్బ్స్‌ అత్యధిక పారితోషికం అందుకుంటున్న వందమంది ప్రపంచ సినీనటుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు అక్షయ్‌కుమార్...

రూ. 356 కోట్లతో అక్షయ్‌ ఒక్కడే

సినిమా రంగంలో ఫోర్బ్స్‌ అత్యధిక పారితోషికం అందుకుంటున్న వందమంది ప్రపంచ సినీనటుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు అక్షయ్‌కుమార్‌. బాలీవుడ్‌ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక నటుడుగా అక్షయ్‌ నిలిచారు. ఫోర్బ్స్‌ ఏటా ఈ జాబితాలను విడుదల చేస్తుంది. సినీ రంగాన్ని కరోనా కుదిపేసిన ఈ ఏడాది కూడా ఆయన ఆదాయం పెద్దగా తగ్గలేదు. రూ. 356 కోట్ల పారితోషికంతో అక్షయ్‌ 52వ స్థానంలో నిలిచారు. ‘బచ్చన్‌పాండే’, ‘బెల్‌బాటమ్‌’ చిత్రాలతో ఆయన రూ. 100 కోట్ల దాకా పారితోషికం అందుకుంటారని ఫోర్బ్స్‌ చెప్పింది. 


Updated Date - 2020-12-20T05:30:00+05:30 IST