Abn logo
Mar 2 2021 @ 19:30PM

మద్యం పట్టివేత

కర్నూలు: అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి రాష్ట్రానికి మద్యాన్నితరలిస్తున్నారనే విశ్వసనీయమైన సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు పంచలింగాల చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. చెక్‌పోస్టు దగ్గర కారులో తరలిస్తున్న 144 బాటిళ్ల తెలంగాణ మద్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని వదిలి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

క్రైమ్ మరిన్ని...