అలర్జీ నివారణకు హోమియో చికిత్స

ABN , First Publish Date - 2021-11-23T09:11:50+05:30 IST

రోజంతా తుమ్ములు, ముక్కులో దురద, నీళ్లు కారడం, విపరీతమైన తలనొప్పి... అలర్జీ బాధితుల్లో కనిపించే...

అలర్జీ నివారణకు హోమియో చికిత్స

రోజంతా తుమ్ములు, ముక్కులో దురద, నీళ్లు కారడం, విపరీతమైన తలనొప్పి... అలర్జీ బాధితుల్లో కనిపించే లక్షణాలు. ఎన్ని మాత్రలు వేసుకున్నా, ఫలితం కొద్ది రోజులే! మరి అలర్జీ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా? అంటే ఆధునిక హోమియో చికిత్సతో అలర్జీని పారదోలవచ్చని అంటున్నారు హోమియో వైద్య నిపుణులు 

డాక్టర్‌ మధు వారణాశి.


విపరీతమైన తుమ్ములు, ముక్కులు బిగదీసుకుపోవడం అలర్జిక్‌ రైనైటిస్‌ ప్రథాన లక్షణాలు. వయసుతో నిమిత్తం లేకుండా, ఆడా, మగా అందర్నీ ఈ సమస్య వేధిస్తుంది.


ఎందుకు వస్తుంది?

అలర్జీకి సంబంధించిన ప్రేరేపకాలు ఎదురైనప్పుడు శరీరం యాంటీబాడీస్‌ను తయారు చేస్తుంది. ఇవి ముక్కులో మాస్ట్‌ కణాలకు అతుక్కుని ఉంటాయి. ఏదైనా పడని వస్తువు తిన్నా, తగిలినా మాస్ట్‌ కణాలు హిస్టమిన్‌ను విడుదల చేస్తాయి. దీంతో ముక్కులోని పొరలన్నీ ఉబ్బిపోతాయి.


లక్షణాలు

తుమ్ములు, ముక్కులో నుంచి నీరు కారడం, కళ్లలో, చెవిలో దురద, ముక్కు బిగుసుకుపోవడం, గొంతులో ఏదో అడ్డు పడిందన్న భావన, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.


అలర్జీ కారకాలు

పొగ, పాలు, బియ్యం, గోధుమలు, వేరుసెనగ గింజలు, మాంసం, ఐస్‌క్రీమ్స్‌, కూల్‌డ్రింక్స్‌, వాతావరణ మార్పులు, ఆల్కహాల్‌, హెయిర్‌డై, స్విమ్మింగ్‌పూల్‌లో కలిపే క్లోరిన్‌, మానసిక ఆందోళన, వంశపారంపర్యం, కొన్ని పెయిన్‌ కిల్లర్స్‌, యాంటీబయాటిక్స్‌ అలర్జీ ప్రేరేపకాలుగా ఉంటూ ఉంటాయి.


నిర్థారణ

సీబీపీ, ఇస్నోఫిల్‌ కౌంట్‌, సీరం ఇమ్యునోగ్లోబ్యులిన్‌ టెస్ట్‌, సీటీ స్కాన్‌, పీఎన్‌ఎస్‌, ఎక్స్‌రే పీఎన్‌ఎస్‌, కాంప్రిహెన్సివ్‌ అలర్జిక్‌ ప్రొఫైల్‌ పరీక్షలతో సమస్యను నిర్థారించుకోవచ్చు.


పరిష్కారం

 అలర్జీ కారకాలకు దూరంగా ఉండాలి

తగినంత విశ్రాంతి, పోషకాహారం తీసుకోవాలి.

చల్లని వాతావరణం, కూల్‌డ్రింక్స్‌, చల్లని పదా ర్థాలకు దూరంగా ఉండాలి.

 వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి.

 దుప్పట్లు, కర్టెన్లు శుభ్రంగా ఉంచుకోవాలి.

 నిల్వ పదార్థాలు తినకూడదు.


హోమియో చికిత్స

ముక్కు అలర్జీని తగ్గించడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధి నివారణ త్వరితమయ్యేలా చేయడం జరుగుతుంది. హోమియో చికిత్స తర్వాత, గతంలో పడని వస్తువులు తిన్నా, అలర్జీ లక్షణాలు కనిపించవు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే అలర్జీ సమూలంగా తగ్గిపోతుంది.


ముక్కు అలర్జీని తగ్గించడానికి హోమియోలో మ?ంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధి నివారణ త్వరితమయ్యేలా చేయడం జరుగుతుంది.


ఫ డా. మధు వారణాశి

 ప్రముఖ హోమియో వైద్యులు

ప్లాట్‌నెం 188, వివేకానందనగర్‌ కాలనీ

కూకట్‌పల్లి, హైదరాబాద్‌

ఫోన్‌ : 8897331110, 8886509509

Updated Date - 2021-11-23T09:11:50+05:30 IST