అఖిలపక్ష భేటీ పెట్టాలి

ABN , First Publish Date - 2020-09-24T09:32:26+05:30 IST

అఖిలపక్ష భేటీ పెట్టాలి

అఖిలపక్ష భేటీ పెట్టాలి

కాంగ్రెస్‌ ఎన్నికల సమన్వయ కమిటీ డిమాండ్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎన్నికల సమన్వయ కమిటీ డిమాండ్‌ చేసింది. జీహెచ్‌ఎంసీలో వార్డుల పునర్విభజనపై ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేయాలని కోరింది. బుధవారం గాంధీభవన్‌లో మర్రి శశిధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ భేటీలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. వర్చువల్‌ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, కమిటీ కన్వీనర్‌ నిరరంజన్‌ తదితరులుపాల్గొన్నారు.   


ఏ ముఖంతో టీఆర్‌ఎస్‌ ఎన్నికలకు వెళుతుంది?

ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసి గద్దెనెక్కి.. ఆ తర్వాత విస్మరించిన టీఆర్‌ఎస్‌ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఎన్నిలకు వెళతారని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్‌లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఫిరోజ్‌ ఖాన్‌, చల్లా నర్సింహారెడ్డి విలేకరులతో మాట్లాడారు.  

Updated Date - 2020-09-24T09:32:26+05:30 IST