జీఎస్‌టీ వసూళ్లలో ఆల్‌టైం రికార్డు

ABN , First Publish Date - 2021-04-02T06:17:30+05:30 IST

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం సరికొత్త ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చి నెలకు జీఎస్‌టీ స్థూల వసూళ్లు రూ.1,23,902 కోట్లకు పెరిగాయి. గత ఏడాది మార్చిలో నమోదైన

జీఎస్‌టీ వసూళ్లలో ఆల్‌టైం రికార్డు

మార్చి నెలకు రూ.1.24 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,685 కోట్లు, తెలంగాణలో రూ.4,166 కోట్ల వసూళ్లు 


న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం సరికొత్త ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చి నెలకు జీఎస్‌టీ స్థూల వసూళ్లు రూ.1,23,902 కోట్లకు పెరిగాయి. గత ఏడాది మార్చిలో నమోదైన రూ.97,590 కోట్ల ఆదాయంతో పోలిస్తే 27 శాతం వృద్ధి చెందినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. వరుసగా ఆరు నెలలుగా జీఎ్‌సటీ ఆదాయం రూ.లక్ష కోట్లు మించడం.. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందనడానికి స్పష్టమైన సంకేతమని పేర్కొంది. నకిలీ బిల్లుల ఏరివేత, జీఎ్‌సటీతో పాటు ఆదాయం పన్ను, కస్టమ్స్‌ శాఖల ఐటీ సిస్టమ్స్‌లోని డేటా ఆధారంగా లోతైన సమాచార విశ్లేషణ కూడా పన్ను వసూళ్ల పెరుగుదలకు దోహదపడిందని తెలిపింది. 


గతనెల జీఎ్‌సటీ ఆదాయంలో సెంట్రల్‌ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) కింద రూ.22,973 కోట్లు, స్టేట్‌ జీఎ్‌సటీ (ఎ్‌సజీఎ్‌సటీ) కింద రూ.29,329 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎ్‌సటీ (ఐజీఎస్‌టీ) కింద రూ.62,842 కోట్లు వసూలయ్యాయి. ఇక పరిహార సుంకం రూపంలో మరో రూ.8,757 కోట్లు సమకూరాయి. 


ఆంధ్రప్రదేశ్‌లో గత నెల జీఎ్‌సటీ వసూళ్లు రూ.2,685.09 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది మార్చి వసూళ్లు రూ.2,548.13 కోట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి చెందాయి. తెలంగాణ విషయానికొస్తే, గడిచిన నెలకు జీఎ్‌సటీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 17 శాతం పెరిగి రూ.4,166.42 కోట్లకు చేరుకున్నాయి. 


2020-21లో జీఎస్‌టీ వసూళ్లు 

నెల (రూ.కోట్లు)

ఏప్రిల్‌ (2020) 32,172

మే 62,151

జూన్‌ 90,917    

జూలై 87,422

ఆగస్టు 86,449

సెప్టెంబరు 95,480

అక్టోబరు 1.05 లక్షలు 

నవంబరు 1.04 లక్షలు 

డిసెంబరు 1.15 లక్షలు 

జనవరి(2021) 1.19 లక్షలు 

ఫిబ్రవరి 1.13 లక్షలు 

మార్చి 1.24 లక్షలు


రాష్ట్రాలకు అదనంగా రూ.45,000 కోట్లు..ఏపీకి రూ.1,850 కోట్లు, తెలంగాణకు రూ.960 కోట్లు 

గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను కేంద్ర పన్ను ఆదాయంలో 41 శాతం వాటాను  రాష్ట్రాలకు పంచాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. 2020-21కి  సవరించిన పన్ను ఆదాయ అంచనాల ప్రకారం.. రాష్ట్రాలకు 41 శాతం వాటా కింద రూ.5,49,959 కోట్లు పంచాల్సి ఉంది. నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో పన్ను వసూళ్లు అంచనాలను మించడంతో రాష్ట్రాలకు రూ.45,000 కోట్లు అదనంగా పంచినట్లు కేంద్రం తెలిపింది. దాంతో, గత ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రాలకు మొత్తం చెల్లింపులు రూ.5,94,996 కోట్లకు చేరుకున్నాయి. రూ.45 వేల కోట్ల అదనపు కేటాయింపుల్లో మార్చి 26న రూ.14,500 కోట్లు, 31న రూ.30,500 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. రెండు విడతల్లో విడుదల చేసిన అదనపు నిధుల్లో ఏపీకి రూ.1,850 కోట్లు, తెలంగాణకు రూ.960 కోట్లు లభించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తానికి గాను ఏపీకి రూ.24,461 కోట్లు, తెలంగాణకు రూ.12,692 కోట్లు లభించాయి. 

Updated Date - 2021-04-02T06:17:30+05:30 IST