Abn logo
Apr 21 2021 @ 13:38PM

కరోనా ఉధృతిపై స్పందించిన ఆళ్ల నాని

నెల్లూరు: జిల్లాలో కరోనా ఉధృతిపై మంత్రి ఆళ్ల నాని స్పందించారు. కొవిడ్ నియంత్రణకు జగన్‌ అన్ని చర్యలు చేపట్టారని చెప్పారు. ఐదుగురు మంత్రులతో కొవిడ్‌ నివారణకు కమిటీ వేసినట్లు వెల్లడించారు. నెల్లూరులో ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. కరోనా నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు కలెక్టర్, ఇన్‌ఛార్జ్‌ డీఎంహెచ్‌ను ఆదేశించామన్నారు. నెల్లూరు జిల్లాలో 12 కొవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేశామన్నారు. 

Advertisement
Advertisement
Advertisement