డ్వాక్రా మహిళలపై ఒత్తిళ్లు లేవు

ABN , First Publish Date - 2020-04-09T09:30:21+05:30 IST

డ్వాక్రా మహిళలపై ఒత్తిళ్లు లేవు

డ్వాక్రా మహిళలపై ఒత్తిళ్లు లేవు

‘సువిధ’ కింద రూ.5 వేల రుణం.. కేశినేని ట్వీట్‌కు యూబీఐ రీట్వీట్‌


విజయవాడ, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): డ్వాక్రా మహిళల రుణాల తిరుగు చెల్లింపు విషయంలో యూనియన్‌ బ్యాంక్‌లో తాజాగా విలీనమైన ఆంధ్రా బ్యాంక్‌ ఎలాంటి ఒత్తిళ్లు చేయడం లేదని యూబీఐ అధికారులు తెలిపారు. ఆంధ్రాబ్యాంక్‌ పార్వతీపురం శాఖ అధికారులు చేస్తున్న ఒత్తిళ్లపై సింహాచలం అనే వ్యక్తి ట్విటర్‌లో కేశినేని నాని దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై అధికారులు తగు చర్యలు తీకుకోవాలని నాని ట్వీట్‌ చేశారు. దీనికి యూనియన్‌ బ్యాంక్‌ అధికారులు ట్విటర్‌లో సమాధానం ఇచ్చారు. మార్చి 1 నుంచి మే 31 వరకు స్వయం డ్వాక్రా మహిళలు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని, అంతేగాకుండా కరోనా ప్రభావంతో అమలు చేసిన లాక్‌డౌన్‌ సహాయం కోసం సువిధ రుణం కింద మరో రూ.5 వేలు తీసుకోవచ్చని అధికారులు రీ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-04-09T09:30:21+05:30 IST