Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్‌కు రంగం సిద్ధం.. ఆఫర్లు ఇలా..

న్యూఢిల్లీ: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 17న ప్రారంభం కానున్న సేల్ 22 వరకు కొనసాగనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం జనవరి 16 అర్ధరాత్రి 12 గంటల నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ ఎసెన్షియల్స్, హోం అండ్ కిచెన్, లార్జ్ అప్లయెన్సెస్, టీవీలు, డైలీ ఎసెన్షియల్స్ వంటి వాటిపై భారీ రాయితీలు ప్రకటించింది.


వాటితోపాటు బ్యాంక్ డిస్కౌంట్లు కూడా తీసుకొచ్చింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ రాయితీ లభిస్తుందని అమెజాన్ పేర్కొంది. బజాజ్ ఫిన్‌‌సెర్వ్, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, అమెజాన్ పే లేటర్‌తోపాటు ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డులపై నోకాస్ట్ ఈఎంఐ‌ అందుబాటులో ఉంది. 


బ్యాంక్ రాయితీలతోపాటు ఎక్స్‌చేంజ్‌ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు రూ. 16 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే, మరాఠీ, హిందీ, బెంగాలీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లోనూ షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా మంచి షాపింగ్ అనుభవం కావాలంటే దగ్గరిలోని అమెజాన్ ఈజీ స్టోర్‌ను సందర్శించవచ్చని అమెజాన్ తెలిపింది. వన్‌ప్లస్, షియోమీ, శాంసంగ్, యాపిల్ వంటి బ్రాండెడ్ ఫోన్లపై వినియయోగదారులకు భారీ రాయితీలు లభించనున్నాయి.


రెడ్‌మి నోట్ 10ఎస్, వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ, రెడ్‌మి 9ఎ స్పోర్ట్, శాంసంగ్ గెలాక్సీ ఎం12, రెడ్‌మి నోట్ 11జి, టెక్నో స్పార్క్ 8టి, ఐక్యూ జడ్5, రెడ్‌మి 10 ప్రైమ్, వన్‌ప్లస్ 9ఆర్‌తో పాటు మరిన్ని ఫోన్లతోపాటు హెచ్‌పీ, ఎల్‌జీ, లెనోవో, ఎంఐ, జీబీఎల్, బోట్, సోనీ, శాంసంగ్, అమాజ్‌ఫిట్, కెనాన్, ఫుజిఫిల్మ్ తదితర కంపెనీ ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్‌పైనా భారీ రాయితీలు లభించనున్నాయి. 

Advertisement
Advertisement