Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమెజాన్ రెండో ఎడిష‌న్.. అద్భుత అవకాశం..

న్యూఢిల్లీ: ‘అమెజాన్ సంభవ్’ రెండో ఎడిష‌న్ స‌ద‌స్సును 2021 ఏప్రిల్ 15 నుంచి 18 వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న‌ట్లు అమెజాన్ ఇండియా ప్ర‌క‌టించింది. ముఖ్య‌మైన ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌ను ఒక చోటుకు తెచ్చి, ఆత్మ‌నిర్భ‌ర భారత్‌ని రూపొందిస్తూ వ్యాపారాలు, వాణిజ్యవేత్తలకు అవకాశాలు కల్పించేలా వారు అమెజాన్‌తో భాగ‌స్వాములు కావ‌డంపై చ‌ర్చించేందుకు ఈ సద‌స్సు నిర్వ‌హిస్తున్నారు. అమెజాన్ వారి వార్షిక స‌ద‌స్సుల‌లో ఈ రెండో ఎడిష‌న్ నాలుగు రోజుల పాటు వ‌ర్చువ‌ల్‌గా జ‌రుగుతుంది.


దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ ఉత్పాద‌క‌, రిటైల్‌, లాజిస్టిక్స్, ఐటీ/ఐటీఈఎస్, కంటెంట్ క్రియేట‌ర్లు, స్టార్ట‌ప్‌లు, బ్రాండ్లు త‌దిత‌ర రంగాలకు సంబంధించి భార‌త‌దేశంలో ఉన్న అపార అవ‌కాశాల‌ను అన్‌లాక్ చేయ‌డం అనే థీమ్‌తో వీటిని నిర్వ‌హిస్తున్నారు. అమెజాన్ సంభవ్‌లో 30 వేల మందికి పైగా పాల్గొనే అవ‌కాశం ఉందని పేర్కొంది. ఇందులో అమెజాన్, దాని భాగ‌స్వాములు క‌లిసి భార‌తీయ వినియోగ‌దారులు, వాణిజ్య‌వేత్త‌లు, చిన్న వ్యాపారుల‌కు డిజిట‌ల్ టెక్నాల‌జీ ద్వారా ఎలా సేవ‌లు అందించ‌వ్చ‌న్న విష‌యాన్ని అందరికీ తెలియ‌జేస్తారు. 

Advertisement
Advertisement