ఎయిర్ టెల్-అమెజాన్ బంపర్ ఆఫర్! రూ. 89కే ప్రైమ్ వీడియో!

ABN , First Publish Date - 2021-01-13T18:38:24+05:30 IST

ఓటీటీ వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్, అమెజాన్ సంయుక్తంగా బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ఎయిర్ టెల్ వినియోగదారులు ఇకపై కేవలం రూ. 89కే ప్రైమ్ వీడియోను వీక్షించేందుకు ఈ ఆఫర్ అవకాశం కల్పిస్తోంది.

ఎయిర్ టెల్-అమెజాన్ బంపర్ ఆఫర్! రూ. 89కే ప్రైమ్ వీడియో!

ముంబై: ఓటీటీ వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్, అమెజాన్ సంయుక్తంగా బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ఎయిర్ టెల్ వినియోగదారులు ఇకపై కేవలం రూ. 89కే ప్రైమ్ వీడియోను వీక్షించేందుకు ఈ ఆఫర్ అవకాశం కల్పిస్తోంది. అయితే..ఇది కేవలం మొబైల్ వినియోగదారులకు మాత్రమే ఉద్దేశించిన మోబైల్ ఎడిషన్ ప్లాన్. ఇందులో భాగంగా ఎస్‌డీ ఫార్మాట్‌లో వీడియోలు చూడవచ్చు. బండల్డ్ ప్రీ-పెయిడ్ ప్యాక్స్‌ రూపంలో వినియోగదారులకు ఎయిర్ టెల్ ఈ ఆఫర్ అందిస్తోంది. 


ప్రారంభ ప్యాక్ ధర కేవలం 89 రూపాలయే. దీనితో ప్రైమ్ వీడియోతో పాటూ 6జీబీ డాటా కూడా లభిస్తుంది. తొలి 30 రోజులు ఫ్రీ ట్రైయల్‌గా ప్రైమ్ వీడియోను వీక్షించవచ్చు. ఇక రూ. 299 ఆఫర్‌తో రోజుకు 1.5జీబీ డాటాతో 28 రోజుల పాటు ప్రైమ్‌ వీడియోను నిరంతరంగా వీక్షించవచ్చు. అమెజాన్ అందించే ఇతర ఫీచర్లు కోరుకునే వారు ఎప్పటిలాగే సంస్థ వెబ్‌సైట్ ద్వారా ప్రైమ్ మెంబర్ షిప్ పొందవచ్చు. స్మార్ట్ వినియోగం అధికంగా ఉన్న భారత్‌ కోసం ప్రత్యేకంగా అమెజాన్ ఈ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది.

Updated Date - 2021-01-13T18:38:24+05:30 IST