అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి ఈయనే!

ABN , First Publish Date - 2020-04-10T10:10:53+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ బరిలో నిలవనున్నారు. నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వాని

అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి ఈయనే!

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 9: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ బరిలో నిలవనున్నారు. నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వానికి పోటీ పడిన సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌ తన ప్రచారాన్ని నిలిపివేశారు. ఆయన రేసు నుంచి తప్పుకోవడంతో బైడెన్‌కు మార్గం సుగమమైంది. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ ప్రత్యర్థిగా ఆయన బరిలో నిలవనున్నారు. డెమోక్రటిక్‌ అభ్యర్థిత్వం ఖాయమైన నేపథ్యంలో బైడెన్‌(77).. భారత సంతతికి చెందిన సెనేటర్‌ కమలా హ్యారిస్‌ ప్రత్యేక అతిథిగా విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో వీరిద్దరి మధ్య రాజకీయంగా యుద్ధవాతావరణం నెలకొనడం గమనార్హం.


Updated Date - 2020-04-10T10:10:53+05:30 IST