అదానీ పోర్ట్స్‌‌కు షాక్... లిస్టింగ్ నుండి తొలగించిన అమెరికా ఎస్&పీ...

ABN , First Publish Date - 2021-04-14T01:47:00+05:30 IST

భారత్‌కు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్‌కు భారీ షాక్ తగిలింది. అమెరికా స్టాక్ ఎక్స్చేంజీ ఎస్ అండ్ పీ డౌజోన్స్ నుంచి ఈ షాక్ ఎదురైంది. మయన్మార్ మిలటరీతో

అదానీ పోర్ట్స్‌‌కు షాక్... లిస్టింగ్ నుండి తొలగించిన అమెరికా ఎస్&పీ...

న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్‌కు భారీ షాక్ తగిలింది. అమెరికా స్టాక్ ఎక్స్చేంజీ ఎస్ అండ్ పీ డౌజోన్స్ నుంచి ఈ షాక్ ఎదురైంది. మయన్మార్ మిలటరీతో వ్యాపార సంబంధాలున్నాయన్న కారణానని చెబుతూ లిస్టింగ్ నుండి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. వివరాలిలా ఉన్నాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎనకమిక్ జోన్ లిమిటెడ్‌ను తమ సస్టైనబిలిటీ సూచీ నుండి తొలగిస్తున్నట్లు ఎస్ అండ్ పీ డౌజోన్స్ ఇండెక్సెస్ వెల్లడించింది.


అదానీ పోర్ట్స్ కంపెనీ యంగూన్‌లో ఓ రేవును నిర్మిస్తోంది. దీంతో పాటు మయన్మార్ ఎకనామిక్ కార్పొరేషన్(ఎ్ంఈసీ) నుండి భూమిని లీజుకు తీసుకున్న విషయం తెలిసింవదే. ఈ నేపధ్యంలో మయన్మార్ సైన్యంతో వ్యాపార సంబంధాలున్నాయని చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా... ఈ అంశంపై అదానీ గ్రూప్ స్పందించవలసి ఉంది. అదానీ పోర్ట్స్ వ్యాపార విభాగం ఎంఈసీ నుండి భూమిని లీజుకు తీసుకున్న అంశంపై అదానీ గ్రూప్ కిందటి నెలలో స్పందించింది. ఈ ఒప్పందంలోని భాగస్వాములతో దీనిపై చర్చిస్తామని వెల్లడించింది.


ఫిబ్రవరి ఒకటిన మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకునన విషయం తెలిసిందే. అక్కడి ప్రజాఉద్యమాన్ని సైన్యం అణచివేస్తోందన్న విమర్శలున్నాయి. వందలాది మంది పౌరులు మరణించారు కూడా. ఈ క్రంలో.. అమెరికా, బ్రిటన్ దేశాలు మయన్మార్ ఎకానమిక్ కారిడార్, మయన్మార్ ఎకానమిక్ హోల్డింగ్స్, పబ్లిక్ కంపెనీ లిమిటెడ్ వ్యవ్థలపై ఆంక్షలు విధించాయి. ఇదే క్రమంలో... అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్‌ను గురువారం ట్రేడింగ్‌కు ముందు లిస్టింగ్ నుండి తొలగించే అవకాశమున్నట్లు సమాచారం. కాగా ఈ పరిణామం ఆయా దేశాల మధ్య సంబంధాలపై మరింత ప్రభావాన్ని చూపిస్తుందని భావిస్తున్నారు. 

Updated Date - 2021-04-14T01:47:00+05:30 IST