పొగాకుకు వ్యతిరేకంగా ఆ అధికారి గళం జన హితం

ABN , First Publish Date - 2021-07-09T22:21:33+05:30 IST

ధి నిర్వహణ, సామాజిక సేవ ఈ రెంటినీ శ్వాస, ధ్యాస లుగా జీవిత పథం నిర్దేశించుకోడం అంత సులువైన విషయం కాదు.

పొగాకుకు వ్యతిరేకంగా ఆ అధికారి గళం జన హితం

నారాయణపేట: విధి నిర్వహణ, సామాజిక సేవ ఈ రెంటినీ  శ్వాస, ధ్యాస లుగా జీవిత పథం నిర్దేశించుకోడం అంత సులువైన విషయం కాదు. కానీ మానవత్వంతో  సాటి మనిషి చెడు అలవాట్లకు బానిసై ఆరోగ్యాన్ని కోల్పోవద్దన్నదే ఆయన సిద్ధాంతంతో ఆయన పొగాకుకు వ్యతిరేకంగా యుద్ధం సాగిస్తున్నారు. తెలంగాణ పౌరసరఫరాల శాఖలో ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ గా పనిచేస్తున్నమాచన రఘునందన్ పొగాకు వినియోగం పై గళమెత్తుతున్నారు. ఉద్యోగ భాధ్యత తో పాటే జనం అందరూ బాగుండాలి, ఆరోగ్యం గా ఉండాలి అని ఆకాంక్షిస్తారాయన.


ప్రస్తుతం నారాయణపేట జిల్లా మరికల్ లో విధులు నిర్వహిస్తున్న మాచన రఘునందన్  ఇటీవల దూరదర్శన్ కూడా ఆయన పై  ప్రత్యేక వార్తా కథనం ను ప్రసారం చేసింది. పొగాకు వ్యతిరేక గళం తో 20ఏళ్లుగా ధూమపాన ప్రియులను ఆ వ్యసనం నుంచి దూరం చేసేందుకు ఆయన చేస్తున్న నిర్విరామ అలుపెరుగని కృషి తాజాగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సైతం గుర్తించింది. వివిధ దిన పత్రిక ల్లో ప్రచురితమైన ప్రత్యేక కధనాలు కూడా రఘునందన్ సేవా తత్పరత ను మానవీయ ఆలోచనా వైశిష్ట్యాన్ని దూరదర్శన్ గుర్తించింది. 


రఘునందన్ ఉద్యోగం చేస్తూనే పొగాకు పై వ్యతిరేక గళం వినిపించడం ఎంతో మంది కి జీవితం పై ఆలోచన కలిగిస్తోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రధాన మంత్రి కార్యాలయానికి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శాఖకు, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూడా ట్వీట్ చేసింది. పొగాకు, ధూమపానం అలవాట్ల తో యువత మత్తు కు చిత్తు కావడం అనర్థం అన్న మానవతా దృక్పథంతో పనిచేస్తున్నారు.

Updated Date - 2021-07-09T22:21:33+05:30 IST