Abn logo
Aug 2 2021 @ 06:59AM

Anantapur: కారును ఢీకొన్న లారీ..ముగ్గురు మృతి

అనంతపురం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గుత్తి సమీపంలోని హైవేపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కర్నూలు జిల్లాకు చెందిన అశ్రఫ్‌ అలీ, లాయక్‌ అలీ, ఖాసీంగా గుర్తించారు.