Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పర్యటన

అమరావతి: రాష్ట్రంలో రెండు రోజుల పాటు నీతిఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు గన్నవరం మండలం వీరప్పనేనిగూడెం గ్రామంలో బి. సతీష్ రెడ్డి వరి పొలాన్ని ఆయన పరిశీలించనున్నారు. అనంతరం రైతులతో రాజీవ్ కుమార్ మాట్లాడనున్నారు. 10 గంటలకు బాతుల కృష్ణారెడ్డి‌కి చెందిన మామిడి తోటలో అంతర పంటగా వేసిన మినుమును పరిశీలించనున్నారు. 10.30కు డ్వాక్రా గ్రూప్ సభ్యులతో గ్రామ కార్యదర్శులతో చర్చించనున్నారు. ఆర్బీకే కేంద్రాల నిర్వహణపైనా వివరాలు సేకరించనున్నారు. డిసెంబర్ 2న కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. 12.30కి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు చేరుకోనున్నారు. 2.15 నిమిషాలకు ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర అధికారులతో  రాజీవ్ కుమార్ సమావేశంకానున్నారు. 4.15కు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మంగళగిరిలోని ఏపీ ఐఐసీ కార్యాలయానికి చేరుకొని పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. 5.30కు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీలు, మేధావులు, పౌర సమాజం సభ్యులతో రాజీవ్ కుమార్ సమావేశం కానున్నారు. 

Advertisement
Advertisement