Abn logo
Aug 2 2020 @ 07:43AM

రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలే!

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పలు చోట్ల మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వరుసగా రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఆగస్టు 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement
Advertisement
Advertisement