మరో బ్యాంకు లైసెన్స్ రద్దు...

ABN , First Publish Date - 2021-06-01T21:12:01+05:30 IST

మరో బ్యాంకు లైసెన్స్ రద్దయ్యింది. తగినంతగా మూలధనం లేకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఈ చర్య తీసుకుంది.

మరో బ్యాంకు లైసెన్స్ రద్దు...

ముంబై : మరో బ్యాంకు లైసెన్స్ రద్దయ్యింది. తగినంతగా  మూలధనం లేకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఈ చర్య తీసుకుంది. కాగా... లైసెన్స్ రద్దు నిర్ణయం  సోమవారం(మే 31) నుంచే  అమలుల్లోకి వచ్చింది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


మహరాష్ట్ర కేంద్రంగా ఉన్న ‘శివాజీరావు భోసలే సహకారి బ్యాంక్’ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. బ్యాంక్ వద్ద సరిపడ మూలధనం లేకపోవడం కారణంగా బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.  బ్యాంక్ లైసెన్స్ రద్దు నిర్ణయం మే 31 నుంచే అమల్లోకి వచ్చిందని పేర్కొంది. బ్యాంక్‌లో 98 శాతం మంది డిపాజిటర్లకు వారి డబ్బు అందుతుందని ఆర్‌బీఐ తెలిపింది. కాగా... రూ. 5 లక్షల వరకు డిపాజిట్ చేసిన వారికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. రూ. 5 లక్షలకు పైగా డిపాజిట్లు ఉంటేనే నష్టపోవాల్సి వస్తుంది.

Updated Date - 2021-06-01T21:12:01+05:30 IST