యశోద ఆస్పత్రిలో యాంటీబాడీ కాక్‌టెయిల్‌ డ్రగ్‌

ABN , First Publish Date - 2021-05-27T09:06:25+05:30 IST

కొవిడ్‌ చికిత్సలో కీలకంగా భావిస్తున్న మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ కాక్‌టెయిల్‌ మందు వినియోగాన్ని యశోద ఆస్పత్రిలో బుధవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

యశోద ఆస్పత్రిలో యాంటీబాడీ కాక్‌టెయిల్‌ డ్రగ్‌

హైదరాబాద్‌ సిటీ, మే 26 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ చికిత్సలో కీలకంగా భావిస్తున్న మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ కాక్‌టెయిల్‌ మందు వినియోగాన్ని యశోద ఆస్పత్రిలో బుధవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. కాసిరివిమాబ్‌, ఇండెవిమాబ్‌ అనే రెండు రకాల మోనోక్లోనల్‌ యాంటీబాడీల మిశ్రమమే ఈ మందు. సిప్లా కంపెనీ భారత్‌లో అందుబాటులోకి తెచ్చిన ఈ మందును తొలిసారి రోగులపై ప్రయోగించినట్లు యశోద ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లింగయ్య తెలిపారు.  ఈ మందును డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఆమోదించిందన్నారు. 

Updated Date - 2021-05-27T09:06:25+05:30 IST