Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్లీజ్... అనుప్రియను ఆదుకోండి

ఆస్పత్రిలో అచేతనంగా పడి ఉన్న 18 ఏళ్ల నా కూతురి వైపు చూస్తున్నప్పుడల్లా నా గుండె బద్దలవుతోంది. ఎలాగైనా నా కూతురు అనుప్రియను కాపాడమని.... ఆమెకు ఈ ప్రపంచంలో ఉన్నది నేను ఒక్కదానిని మాత్రమేనని... తను లేని లోకాన్ని భరించలేనని... డాక్టర్లను కన్నీటితో వేడుకున్నాను.


బలహీనమై... పాలిపోయిన నా కుమార్తె దేహాన్ని చూస్తుంటే.... IAS అధికారి కావడం కోసం తను ఎంత శ్రమపడిందో నాకంతా గుర్తుకు వస్తూనే ఉంది. తను గొప్ప స్టూడెంట్. మన దేశానికి సేవ చెయ్యాలని ఎన్నో కలలు కంది.


ఈ ఏడాది అక్టోబర్ 01వ తేదీ.... అన్ని రోజుల్లాంటిదే ఇది కూడా.... అనుప్రియ చదువుకుంటోంది, నేను మా కోసం రాత్రి భోజనం సిద్ధం చేస్తున్నాను. అకస్మాత్తుగా నేను తన గదిలోంచి పెద్ద శబ్దం విన్నాను. వెళ్లి చూస్తే అనుప్రియ స్పృహతప్పి కింద పడిపోయి ఉంది.


నేనెంతో కంగారు పడి మా ఇంటి దగ్గరున్న ఒక డాక్టర్ గారిని ఇంటికి పిలిపించాను. అయితే, ఏం జరిగిందన్నది ఆయనకి కూడా అర్థం కాక, వెంటనే పెద్దాస్పత్రికి తీసుకెళ్ళమని మాకు చెప్పాడు. మేమెంతో భయపడి వెంటనే మా అమ్మాయిని ఆస్పత్రికి తీసుకెళ్ళాం. డాక్టర్లు వెంటనే చూచి పరీక్షలు చేశారు. పరీక్షలు పూర్తయి, గంటల పాటు పరిశీలించిన తర్వాత డాక్టర్ గారు మమ్మల్ని ఆఫీసులోకి పిలిచారు. ఆయన ముఖం గంభీరంగా ఉంది.


విరాళం ఇవ్వడానికి క్లిక్ చేయండి

"మీ అమ్మాయి acute thrombosis and bifrontal haemorrhageకి గురైంది. ఇలా చెప్పడం నాకెంతో బాధగా ఉంది. ఆమె మెదడులో అంతర్గత రక్తస్రావం జరిగింది. ఏమాత్రం ఆలస్యం జరగకుండా సర్జరీ చెయ్యాలి..." అని టెస్ట్‌ల ఫలితాలు చూపిస్తూ అంతా వివరించారు.


డాక్టర్ చెప్పిందంతా విని మేం షాక్‌కి గురయ్యాం. మా అమ్మాయి జీవితం పెను ప్రమాదంలో ఉంది. వేగంగా సర్జరీ జరగడం పైనే అనుప్రియ జీవితం ఆధారపడి ఉంది. అంతలోనే నన్ను భయపెట్టే మరో ఆలోచన వచ్చింది. "ఈ సర్జరీకి ఎంత ఖర్చవుతుంది?... ఆ ఖర్చు మేం భరించగలమా?..." డాక్టర్ గారిని ప్రశ్నించాను.


సర్జరీకి అయ్యే ఖర్చు గురించి ఆయన వివరిస్తుంటే నా ఒళ్లు మొద్దుబారిపోయింది. మొత్తం సర్జరీకి అయ్యే ఖర్చు సుమారుగా రూ. 15,58,200 (డాలర్లలో... 20802.28) అవుతుందని చెప్పారు. ఆయన చెప్పింది వినగానే నాకు, నా భర్త శివకుమారకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నాకు కన్నీరు ఆగలేదు. రూ.15 లక్షలా? అంత డబ్బు ఎలా తేవాలో... అన్న ఆలోచనలో పడ్డాను.


నా భర్త ఒక కార్మికుడు. ఆయన నెల జీతం రూ.10,000 మాత్రమే. మా అమ్మాయి వైద్యం కోసం అంత డబ్బు సంపాదించడం మాకు అసాధ్యం. మాకున్న విలువైన వస్తువులన్నీ అమ్మేశాం.... అంత పెద్ద మొత్తాన్ని సంపాదించే దారి ఇంకా కనిపించలేదు. మాకిప్పుడు ఏమీ లేదు... మీ సహాయమే మాకున్న ఏకైక ఆధారం. మా అమ్మాయికి ఎప్పుడు సర్జరీ జరుగుతుందా.... అని వెయ్యి కళ్ళతో వేదనతో ఎదురుచూస్తున్నాం. ఆమెకు నిండు జీవితాన్ని అందించడం మీ చేతుల్లోనే ఉంది. దయచేసి పెద్ద మనస్సుతో విరాళం అందించండి.

Advertisement
Advertisement

జాతీయం మరిన్ని...

చిత్రజ్యోతి మరిన్ని...