1.61 లక్షల కిలోమీటర్ల పరిధికి ఏపీ అంగీకారం

ABN , First Publish Date - 2020-10-22T06:53:12+05:30 IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అంతర్రాష్ట్ర బస్సు సర్వీ్‌సల ప్రారంభంపై కొంత పురోగతి ఉన్నట్లు తెలిసింది. టీఎ్‌సఆర్టీసీ సూచించిన

1.61 లక్షల కిలోమీటర్ల పరిధికి ఏపీ అంగీకారం

సరేనంటే నేటి నుంచే అంతర్రాష్ట బస్సులు!

హైదరాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అంతర్రాష్ట్ర బస్సు సర్వీ్‌సల ప్రారంభంపై కొంత పురోగతి ఉన్నట్లు తెలిసింది. టీఎ్‌సఆర్టీసీ సూచించిన 1.61 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడపడానికి ఏపీ ప్రాథమికంగా అంగీకరించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని తెలంగాణ అధికారులు రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మకు బుధవారం నివేదించారు. అనుమతి వస్తే గురువారం నుంచే బస్సులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.


ఏపీ బస్సులు తెలంగాణలో 2.64 లక్షల కిలోమీటర్లు, తెలంగాణ బస్సులు ఏపీలో 1.61 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. ఏపీలో తాము నడుపుతున్న కిలోమీటర్ల మేరకే తెలంగాణలో ఏపీ బస్సులను తిప్పాలని టీఎ్‌సఆర్టీసీ డిమాండ్‌ చేస్తోంది. దీనికి ఏపీ అంగీకరించలేదు. కానీ, బస్సులను నడపకపోవడంతో ఇరు సంస్థలు పెద్దమొత్తంలో రాబడి కోల్పోతుండటమే కాక.. ప్రైవేటు ఆపరేటర్లకు ఊతమిచ్చినట్లవుతుందన్న ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఎన్నో కొన్ని కిలోమీటర్లకు ఒప్పందం చేసుకుందామన్న ఆలోచనకు వచ్చిన ఏపీ అధికారులు తెలంగాణ ప్రతిపాదనకు అంగీకరించారు. 

Updated Date - 2020-10-22T06:53:12+05:30 IST