కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

ABN , First Publish Date - 2021-10-28T20:13:37+05:30 IST

ఏపీ కేబినెట్ భేటీ కొద్ది సేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలనను కేబినెట్ ఆమోదించింది.

కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

అమరావతి: ఏపీ కేబినెట్ భేటీ కొద్ది సేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కేబినెట్ ఆమోదించింది. సినిమాటోగ్రఫీ చ‌ట్ట స‌వ‌ర‌ణకు, బీసీ జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా వాడరేవు సహా 5 ఫిషింగ్‌ హార్బర్ల డీపీఆర్‌లకు, 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ సరఫరా కోసం త్రైపాక్షిక ఒప్పందానికి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాతో వివరించారు. వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలో కొత్త ఉద్యోగాల కల్పనకు కేబినెట్ ఆమోదించిందని మంత్రి తెలిపారు.


ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు

నవంబర్‌ 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు 

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి ఆమోదం

7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ సరఫరా కోసం..

త్రైపాక్షిక ఒప్పందానికి ఏపీ కేబినెట్‌ ఆమోదం

సినిమాటోగ్రఫీ చ‌ట్ట స‌వ‌ర‌ణకు ఏపీ కేబినెట్‌ అమోదం

బీసీ జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానానికి ఆమోదం

అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం 

కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం 

వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి ఏపీ కేబినెట్ ఆమోదం 

పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి ఏపీ కేబినెట్ ఆమోదం

విశాఖలో తాజ్‍వరుణ్ బీచ్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్ 

ఏపీలో ఐదు చోట్ల సెవన్ స్టార్ పర్యాటన రిసార్ట్‌ల ఏర్పాటుకు ఆమోదం 

జయలక్ష్మీ నరసింహశాస్త్రి గుండ్లూరు ట్రస్ట్‌కు..

అనంతపురంలోని బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపునకు ఆమోదం 

శ్రీశారదాపీఠానికి కొత్తవలసలో 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం 

ప్రకాశం జిల్లా ఓడరేవు సహా 5 ఫిషింగ్‌ హార్బర్ల డీపీఆర్‌లకు ఆమోదం

Updated Date - 2021-10-28T20:13:37+05:30 IST