Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమవుతున్న ఉద్యోగ సంఘాలు

అమరావతి: ప్రభుత్వంపై పోరుబాటకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా చేయనున్న ఉద్యమానికి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉద్యోగులను సిద్ధం చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల్లో ఉద్యమ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో.. మంగళవారం విశాఖపట్నం, కాకినాడలో నిర్వహించనున్న సమావేశంలో ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పాల్గొననున్నారు. అలాగే అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాల్లో సమావేశాలు జరగనున్నాయి.


Advertisement
Advertisement