రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా..?

ABN , First Publish Date - 2021-05-16T01:14:21+05:30 IST

రఘురామ కేసు స్పెషల్ మూవ్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. రఘురామరాజు కాలి దెబ్బల ఫొటోలు చూసిన హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ తీవ్ర ఆగ్రహం ..

రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా..?

అమరావతి: రఘురామ కేసు స్పెషల్ మూవ్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. రఘురామరాజు కాలి దెబ్బల ఫొటోలు చూసిన హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు రఘురామ కోర్టుకు తెలిజేశారట. ఈ విషయాన్ని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. అయితే ఆయనను ప్రభుత్వాసుపత్రికి తరలించడానికి తాము అభ్యంతరం చెప్పామని, రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్తామని కోర్టును కోరినట్లు చెప్పారు. రిమాండ్ రిజెక్ట్ చేయాలని కూడా న్యాయస్థానానికి విన్నివించామన్నారు. అయితే వీటిపై ఇంకా ఆర్డర్లు రావాల్సి ఉందని లాయర్ లక్ష్మీనారాయణ తెలిపారు.

Updated Date - 2021-05-16T01:14:21+05:30 IST