Advertisement
Advertisement
Abn logo
Advertisement

2018 డీఎస్సీ నియామకాలపై ఏపీ హైకోర్టులో విచారణ

అమరావతి: 2018 డీఎస్సీ నియామకాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇంటర్మీడియట్ లేకపోయినా స్కూల్ అసిస్టెంట్ పోస్టులివ్వడాన్ని హైకోర్టులో విశాఖకు చెందిన చిన్నంనాయుడు సవాల్ చేశాడు. గతంలో ఇంటర్ లేకుండా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైనవారిని గుర్తించి నియామకాన్ని డీఈవో నిలుపుదల చేశాడు. 2018 డీఎస్సీ బ్యాచ్‌లో ఇంటర్ లేకపోయినా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇస్తూ అప్పటి విద్యాశాఖ కమిషనర్ క్లారిఫికేషన్ ఇచ్చారు. విద్యాశాఖ ఇచ్చిన క్లారిఫికేషన్‌ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ఇంటర్ లేకుండా ఓపెన్ డిగ్రీపై స్కూల్ అసిస్టెంట్ పోస్టులివ్వడం విద్యాశాఖ నిబంధనలకు విరుద్దమని పిటిషనర్ లాయర్ యోగేష్‌ వాదించారు. న్యాయవాది యోగేష్‌ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఇంటర్ ఉండి, డిగ్రీ అర్హతతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైనవారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.Advertisement
Advertisement