ఇస్రో ప్రయోగ వేదికపై జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 రాకెట్‌

ABN , First Publish Date - 2022-10-16T09:54:49+05:30 IST

ఇస్రో ప్రయోగ వేదికపై జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 రాకెట్‌

ఇస్రో ప్రయోగ వేదికపై జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 రాకెట్‌

23న.. 36 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలు కక్ష్యలోకి..


సూళ్లూరుపేట, అక్టోబరు 15:  తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష  ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి ఈ నెల 23న జీఎ్‌సఎల్‌వీ-మార్క్‌ 3(ఎల్‌వీ-ఎం3) రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ రాకెట్‌కు సంబంధించిన మూడు దశల అనుసంఽధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తిచేసి రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేశారు. శనివారం రాకెట్‌ను వాహక అనుసంధాన భవనం (వ్యాబ్‌) నుంచి రెండో ప్రయోగ వేదికకు తరలించారు. ఉదయం 6గంటలకు షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ పచ్చజెండా ఊపి రాకెట్‌ను ట్రాక్‌పై నెమ్మదిగా ప్రయోగ వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఈ నెల 22న రాత్రి 12.07గంటలకు అనగా 23వ తేదీన జీఎ్‌సఎల్‌వీ రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం ద్వారా వన్‌ వెబ్‌ ఇండియా-1 పేరుతో యూకేకి చెందిన 5.2 టన్నుల బరువు గల 36 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎ్‌సఐఎల్‌)తో కుదిరిన ఒప్పందం మేరకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. రాకెట్‌ శిఖర భాగాన ఉష్ణకవచంలో (హీట్‌షీల్డ్‌) అమర్చిన ఉపగ్రహాలను మరోసారి కూడా పరిశీలించి సిద్ధం చేస్తున్నారు. ప్రయోగానికి మూడు రోజుల ముందు రాకెట్‌ సన్నద్ధ సమావేశం (ఎంఆర్‌ఆర్‌) జరగనుంది. అనంతరం, లాంచింగ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) సమావేశమై ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది.

Updated Date - 2022-10-16T09:54:49+05:30 IST