ఏపీలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు: కలెక్టర్

ABN , First Publish Date - 2020-08-14T03:15:47+05:30 IST

ఏపీలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు: కలెక్టర్

ఏపీలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు: కలెక్టర్

కృష్ణా: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మూలంగా రానున్న రెండు రోజులలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. జిల్లాలోని అన్ని మండలాల్లో లోతట్టు గ్రామాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు, రెవెన్యూ యంత్రాంగానికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని డివిజనల్ కార్యాలయాల్లో  కంట్రోల్  రూమ్ లు  ఏర్పాటు చేశాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు రెవెన్యూ యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ సూచించారు. కృష్ణా జిల్లాలోని ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు: బందరు కలెక్టరేట్: 08672-252572, విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం: 0866 - 2474805, సబ్ కలెక్టర్ ఆఫీస్ విజయవాడ: 0866-2574454, సబ్ కలెక్టర్ ఆఫీస్ నూజివీడు 08656- 232717, రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ బందర్ ఫోన్ నెంబర్: 08672-252486, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ గుడివాడ ఫోన్ నెంబర్: 08674 - 243697, ఈ కంట్రోల్ రూమ్ నెంబర్లకు ప్రజలు ఫోన్ చేయాలని సూచించారు.

Updated Date - 2020-08-14T03:15:47+05:30 IST