Advertisement
Advertisement
Abn logo
Advertisement

చంద్రబాబు ఎందుకు అలా చేశారో ... స్పీకర్ తమ్మినేని

గుంటూరు: ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సభలో లేని మహిళల ప్రస్తావన ఎక్కడా రాలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు అలా చేశారో ఆయనకే తెలియాలని స్పీకర్ వ్యాఖ్యానించారు. వ్యక్తిగత వ్యవహారాలను సభ ముందు పెట్టడం సరికాదని హితవు పలికారు. సభలో అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నామన్నారు. చంద్రబాబుకు మైక్ ఇవ్వలేదనడం బాధాకరమన్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిపై శాసనసభ సమావేశాల్లో అవమానకర వ్యాఖ్యలు చేశారని ఏపీ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, పార్టీ అభిమానులు తీవ్రస్థాయిలో నిరసనలకు దిగిన విషయం తెలిసిందే.


Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement