Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎస్‌ఈసీకి ఏపీసీసీ లీగల్‌ సెల్‌ ఫిర్యాదు

విజయవాడ: ఎస్‌ఈసీకి ఏపీసీసీ లీగల్‌ సెల్‌ ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో అధికార, విపక్షాలు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని ఎస్‌ఈసీకి నరహరిశెట్టి నరసింహారావు ఫిర్యాదు చేశారు. ఖాళీ పెరుగు డబ్బాలో ఇంటింటికి డబ్బు పంచుతున్నారని, ఓటుకు రూ.1000 చొప్పున ఇస్తున్నారని నరసింహారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. పట్టణాల్లో ప్రచార హోరు మొదలైంది. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఘట్టం ముగిసింది. పోరుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. పోలింగ్‌కు 4 రోజులు మాత్రమే గడువుంది. దీంతో ఓటర్లుకు పార్టీలు ప్రసన్నం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓట్లను కొలుగోలు చేసేందుకు అధిక మొత్తంలో డబ్బును పంచుతున్నారు.

Advertisement
Advertisement