క్రిప్టో ఆస్తులను చేర్చెలా పన్ను చట్టాల సర్దుబాటుకు వినతి...

ABN , First Publish Date - 2022-01-17T20:32:06+05:30 IST

భారత్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, బంగారంతో పాటు కొన్నాళ్ళుగా క్రిప్టో కరెన్సీలో కూడా పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే.

క్రిప్టో ఆస్తులను చేర్చెలా పన్ను చట్టాల సర్దుబాటుకు వినతి...

న్యూఢిల్లీ : భారత్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, బంగారంతో పాటు కొన్నాళ్ళుగా క్రిప్టో కరెన్సీలో కూడా పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి సంబంధించి సరైన పన్ను నిబంధనలు లేవు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో క్రిప్టోకు సంబంధించి కంపెనీలు, ఆర్థికవేత్తల నుండి కేంద్రానికి సూచనలందుతున్నాయి. క్రిప్టో కరెన్సీ పన్నుకు సంబంధించిన నిబ:నలు ఉండాలని చెబుతున్నారు.


కన్స్యూమర్ ఇంటర్నెట్ స్టార్టప్స్‌కు సంబంధించిన ఇండస్ట్రీ అసోసియేషన్ ఇండియా టెక్...త మంత్రి నిర్మలా సీతారామన్‌ కు క్రిప్టో కరెన్సీ పన్ను విషయంలో లేఖ రాశారు. కేంద్ర బడ్జెట్ 2022-23 లో క్రిప్టో ట్యాక్సేషన్ పై స్పష్టత అవసరమని పేర్కొన్నారు. ఇండియా టెక్ అన్ని ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలకు ప్రాతినిధ్యం  వహిస్తోంది. కొన్ని క్రిప్టో ఎక్స్ఛేంజీలు వస్తు, సేవల పన్ను ఎగవేత స్కానర్ కిందకు వచ్చాయి. అయితే ఈ బాడీలో కాయిన్ స్విచ్ కుబేర్, వాజిర్ఎక్స్, కాయిన్ డీసీఎక్స్ ఉన్నాయి.


పన్ను చట్టాల సర్దుబాటు...

క్రిప్టో ఆస్తులను చేర్చడానికి ఇప్పటికే ఉన్న పన్ను చట్టాలను సర్దుబాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ట్యాక్సేషన్, డిస్‌క్లోజర్స్ గురించి స్పష్టతను కోరింది. బడ్జెట్‌లో క్రిప్టో పన్నులకు సంబంధించి స్పష్టత అవసరమని, లేదంటే గందరగోళంగా ఉంటుందని ఇండియాటెక్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రమీష్ కైలాసం ఆందోళన వ్యక్తం చేశారు. 


క్రిప్టో పెట్టుబడులు... 

కిందటి నెలలో జీఎస్‌టీ డిపార్టుమెంట్ క్రిప్టో ఎక్స్చేంజ్ వాజీర్ఎక్స్ పై రూ. 40 కోట్ల జరిమానాను విధించింది. ఇటీవల దేశంలో క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్స్ భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. బిట్ కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టోల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. 

Updated Date - 2022-01-17T20:32:06+05:30 IST