కొత్త మోడల్‌లో ఐఫోన్ స్మార్ట్‌ఫోన్స్..

ABN , First Publish Date - 2021-09-14T22:55:56+05:30 IST

కొత్త మోడల్‌లో ఐఫోన్ స్మార్ట్‌ఫోన్స్..

కొత్త మోడల్‌లో ఐఫోన్ స్మార్ట్‌ఫోన్స్..

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 13 సిరీస్  ఫోన్లను మంగళవారం రాత్రి 10.30 గంటలకు విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఐఫోన్ 13 నాలుగు మోడళ్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో మరియు ఐఫోన్ 13 ప్రో మాక్స్ ఫోన్లను అందుబాటులోకి రానున్నాయి. ఆపిల్ వాచ్ సిరీస్ 7ను ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఆపిల్ వాచ్ సిరీస్ 7 పెద్ద డిస్‌ప్లే, బ్యాటరీలను అనుసంధానం చేసే అవకాశం ఉంది. 

Updated Date - 2021-09-14T22:55:56+05:30 IST