ప్రాజెక్ట్ టైటాన్... ఆపిల్... సెల్ఫ్ డ్రైవింగ్ కార్.. మరో మూడేళ్ళలో అందుబాటులోకి...

ABN , First Publish Date - 2021-01-04T03:48:57+05:30 IST

ఐఫోన్‌ తయారీదారు ఆపిల్‌... ఇప్పుడు సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్‌ టెక్నాలజీ దిశగా అడుగులేస్తోంది. మరో మూడేళ్ళలో వీటి ఉత్పత్తిని ప్రారంభించాలన్న లక్ష్యంతో సన్నాహాలు చేసుకుంటోంది.

ప్రాజెక్ట్ టైటాన్... ఆపిల్... సెల్ఫ్ డ్రైవింగ్ కార్.. మరో మూడేళ్ళలో అందుబాటులోకి...

న్యూయార్క్ : ఐఫోన్‌ తయారీదారు ఆపిల్‌... ఇప్పుడు సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్‌ టెక్నాలజీ దిశగా అడుగులేస్తోంది. మరో మూడేళ్ళలో వీటి ఉత్పత్తిని ప్రారంభించాలన్న లక్ష్యంతో సన్నాహాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో... గతంలో లేని బ్యాటరీ టెక్నాలజీ వాడనున్నట్లు వెల్లడించింది. దీనికి ‘ప్రాజెక్ట్‌ టైటాన్‌’ అనే పేరును ఖరారు చేశారు.


వాస్తవానికి... తొలిసారి ఆరేళ్ళ క్రితమే... సొంతంగా వెహికిల్‌ తయారీపై ఆపిల్‌ దృష్టి సారించింది. అంతకుముందు తనతో పనిచేసి టెస్లాకు వెళ్లిన సీనియర్‌ ఉద్యోగి డాగ్‌ ఫీల్డ్‌ను 2018 లో ఆపిల్‌ మళ్లీ వెనక్కు రప్పించుకుంది. కాగా... 2019 లో ఈ బృందం నుంచి 190 మంది సిబ్బందిని తొలగించింది. ఇప్పటికే ఆపిల్‌ ప్రత్యర్థులైన ఆల్ఫాబెట్‌ ఐఎన్‌సీ వేమో పేరుతో రోబో ట్యాక్సీలను తయారు చేసింది. బ్యాటరీ ఖర్చును భారీగా తగ్గించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ కారులో వినియోగించనున్నట్లు తెలుస్తున్నప్పటికీ... ఈ విషయమై ఆపిల్ మాత్రం అధికారికంగా ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటననూ చేయలేదు. ఇక...సాంప్రదాయ కార్ల తయారీ సంస్థ ద్వారా తమ కార్లను అసెంబుల్‌ చేయించే దిశగా ఆపిల్ యోచిస్తున్నట్లు వినవస్తోంది. 

Updated Date - 2021-01-04T03:48:57+05:30 IST