ఆపిల్ వాచ్ సిరీస్ 7 అమ్మకాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-15T23:18:14+05:30 IST

ఆపిల్ వాచ్ సిరీస్ 7 అమ్మకాలు ప్రారంభం

ఆపిల్ వాచ్ సిరీస్ 7 అమ్మకాలు ప్రారంభం

న్యూఢిల్లీ: అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ ఆపిల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో ఆపిల్ వాచ్ సిరీస్ 7ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. భారత మార్కెట్‌లో శుక్రవారం నుంచి ఆపిల్ వాచ్ సిరీస్ 7 వాచీలు అమ్ముతున్నట్లు సంస్థ తెలిపింది. ఆపిల్ వాచ్ సిరీస్ 7 వాచీల ప్రారంభ ధర రూ. 41,900 ఉంటుందని సంస్థ తెలిపింది. ఆపిల్ వాచ్ సిరీస్ 7 41ఎంఎం మరియు 45 ఎంఎం సైజుల్లో అందుబాటులో ఉంటుంది. యాపిల్ వాచ్ సిరీస్ 7లో ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. కానీ భారతదేశంలో అందుబాటులో ఉండదని సంస్థ తెలిపింది. ఆపిల్ వాచ్ సిరీస్ 7 క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయవచ్చు.

Updated Date - 2021-10-15T23:18:14+05:30 IST