Advertisement
Advertisement
Abn logo
Advertisement

టూరిజం గైడ్స్‌, ఫొటోగ్రాఫర్లకు దరఖాస్తుల ఆహ్వానం

కడప : జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని పర్యాటకులకు వివరించేందుకు టూరిజం గైడ్స్‌, ఫొటోగ్రాఫర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటకశాఖ అధికారి రాజశేఖర్‌ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గండికోట, అమీన్‌ పీర్‌దర్గా(పెద్దదర్గా) పుష్పగిరి, సిద్దవటం, రాయచోటి, ప్రొద్దుటూరు, అల్లాడుపల్లి, నందలూరు, ఒంటిమిట్ట, అత్తిరాల, ఆడపూరు, పొలతలు, గండి, ఇడుపులపాయ, భైరవేశ్వరాలయం తదితర పర్యాటక ప్రాంతాల్లో గైడ్‌లు, ఫొటోగ్రాఫర్లుగా పని చేసేందుకు స్థానికులైన ఆసక్తిగల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఒక్కో ప్రాంతానికి ముగ్గురు గైడ్స్‌, ఒక ఫొటోగ్రాఫర్‌ అవసరమన్నారు. ప్రభుత్వం నుంచి జీతభత్యాలు ఉండవని, పర్యాటకుల నుంచి తగిన పారితోషికం తీసుకోవచ్చన్నారు. జిల్లా పర్యాటక మేసేజరు రామ్‌కుమార్‌ (9121725454) కు సంప్రదించాలన్నారు.

Advertisement
Advertisement