Advertisement
Advertisement
Abn logo
Advertisement

రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్: తెలంగాణ గురుకుల అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ప్రవేశపరీక్ష(టీజీయూజీసెట్‌)-2022కు ఈ నెల 10వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ లోపు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కన్వీనర్‌ రోనాల్డ్‌ రాస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌, తత్సమాన పరీక్షలో 40% మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం(ఇంగ్లిష్‌ మీడియం)లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జనవరి 23న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.tswreis.ac.inwww.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్లను చూడాలని సూచించారు. 

Advertisement
Advertisement