చేతకాకపోతే తప్పుకోండి

ABN , First Publish Date - 2021-05-19T09:45:30+05:30 IST

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడం చేతకాకపోతే సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆ పదవి నుంచి తప్పుకోవాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు సూచించారు.

చేతకాకపోతే తప్పుకోండి

సమాచారశాఖ మంత్రికి ఏపీయూడబ్ల్యూజే సూచన

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 18: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడం చేతకాకపోతే సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆ పదవి నుంచి తప్పుకోవాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు సూచించారు. జర్నలిస్టుల సమస్యలపై సోమవారం సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. అనంతరం ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆస్పత్రుల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన జర్నలిస్టులకు పడకలు ఇవ్వని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో కరో నా మొదటి వేవ్‌లో 45మంది, సెకండ్‌ వేవ్‌లో సుమారు 70మంది జర్నలిస్టులు మృత్యువాతపడ్డారన్నారు. మరణించిన జర్నలిస్టులకు రూ.5లక్షలు ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వం జీవో జారీ చేసినా ఆ డబ్బులిచ్చే విషయంలో సమాచారశాఖ మంత్రి వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. ఇతర రా ష్ట్రాల్లో మాదిరిగా జర్నలిస్టులను ప్రభుత్వ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి రూ.50లక్షల బీమా వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-19T09:45:30+05:30 IST