అరటికాయ పెరుగు పచ్చడి

కావలసిన పదార్థాలు: అరటి కాయలు- మూడు, పెరుగు- ఒకటి న్నర కప్పు, చింతపండు- కొద్దిగ, పచ్చి మిర్చి- పది, కరివేపాకు - రెండు రెబ్బలు, ఉప్పు, నూనె- తగి నంత, పోపు గింజలు- ఓ స్పూను.


తయారు చేసే విధానం: ఒక్కో అరటికాయని మూడు ముక్కలుగా కోసి ఉడికించాలి. ఓ పాన్‌లో నూనె వేసి పచ్చిమిర్చి, పోపు గింజలు, చింతపండు వేయించి గ్రైండ్‌ చేసి పెరుగులో కలపాలి. ఆ తర్వాత ఉప్పు జతచేయాలి. అరటికాయ ముక్కల తొక్క తీసి పెరుగులో వేసి గరిటతో బాగా కలపాలి. దీనికి జీలకర్ర, కరివేపాకు పోపు పెడితే అరటికాయ పెరుగు పచ్చడి సిద్ధం.

ముల్లంగి తొక్కునువ్వుల చట్నీక్యాప్సికమ్‌ పెరుగు పచ్చడితీపి కాకర పచ్చడిబొంబాయి చట్నీఉసిరి చట్నీఉసిరికాయ అచార్‌అల్లం పచ్చడికరివేపాకు పచ్చడినువ్వుల పచ్చడి
Advertisement
Advertisement