‘విభజన’ హమీలు నేరవేరేనా?

ABN , First Publish Date - 2022-01-12T05:00:41+05:30 IST

‘విభజన’ హమీలు నేరవేరేనా?

‘విభజన’ హమీలు నేరవేరేనా?
బయ్యారంలో ఇనుపఖనిజం

నేడు కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి సమావేశం

బయ్యారం ఉక్కు, సింగరేణిపై ఉత్కంఠ

సింగరేణిలో వాటా కోరుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

ఇల్లెందు, జనవరి 11: ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం హామీలపై నేడు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఉన్నతస్థాయి అధికారుల సమావేశంపై సర్వ త్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరు గుతున్న ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల చీఫ్‌ సెక్రటరీలు ఇతర ఉన్నతస్ధాయి అధికారులు పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014 ఇచ్చిన హామీల అమలు తీరును ఈ సమావేశంలో చర్చించనుండ టంతో బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటుతోపాటు, సింగరేణి కాలరీస్‌కు చెందిన విజయవాడ సమీపంలోని హేవీ మిషనరీ ఇంజనీరింగ్‌ కంపెనీ(ఆఫ్మెల్‌) లపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. రాష్ట్ర విభజన జరిగి ఏడు సంవత్సరాలైనప్పటికీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కాగితాలకే పరిమితమైంది.   

సింగరేణిలో అడుగుతున్న ఏపీ ప్రభుత్వం

రూ.1,200కోట్ల అప్పులతో ఖాయిలపడిన విజయవాడ సమీపంలోని ఆంధ్ర ప్రదేశ్‌ హేవీఇంజనీరింగ్‌ కంపెనీ(ఆఫ్మెల్‌)ని 1994లో టేకోవర్‌ చేసి దానిని అభి వృద్ధి చేయడమే గాక ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లిస్తున్న సింగరేణి కాలరీస్‌లో ఏపీ ప్రభుత్వం వాటా అడుగుతున్న పరిణామాలు సర్వత్రా చర్చనీయాంశమ య్యాయి. నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతూ దివాళా తీసిన ఆఫ్మెల్‌ కంపెనీని 1994లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిపై ఒత్తిడి తెచ్చి దత్తత తీసుకునే విధంగాచర్యలు తీసుకుంది. ఫలితంగా అప్పటినుంచి సింగరేణి కాలరీస్‌ ఆఫ్మెల్‌కు భారీగా పెట్టుబడులు పెడుతూ లాభాల బాటాలోకి తేవడమేగాక దాదాపు 300 మంది ఉద్యోగులు, అధికారుల జీతాభత్యాలను భరిస్తోంది. దాదాపు రూ.1,200ల కోట్ల విలువైన ఆస్తులు,209 ఎకరాల భూములు కలిగిన ఆఫ్మెల్‌ కంపెనీ సింగరేణి దత్తత సంస్థగా ఉంది. పునర్విభజన చట్టం-2014 షెడ్యూల్‌12లో ఆఫ్మెల్‌ కంపెనీని చేర్చడం వల్ల సింగరేణికి దానిపై పూర్తిహక్కులు లభించాల్సి ఉంది. కానీ ప్రభుత్వ రంగసంస్థలను 9, 10 షెడ్యూళ్లలో చేర్చడం వల్ల 2018లో షీలాబేడీ కమిటీ ఆఫ్మెల్‌ కంపెనీ ఏపీకి చెందుతుందని పేర్కొనడం, ఏపీ ప్రభుత్వం కూడా తమకే చెందుతుందని ప్రకటించడంతో సింగరేణి నుంచి వాటా రావాలని పట్టుబడు తోంది. ఆఫ్మెల్‌ కంపెనీలో సింగరేణికి 85శాతం, ఏపీ ఐడీసీకి 6శాతం, ఏపీ ప్రభు త్వానికి 1శాతం, ప్రైవేట్‌ షేర్‌హోల్టర్లకు మిగిలిన వాటాలున్నాయి. ఆఫ్మెల్‌ కంపె నీని అభివృద్ధి చేసేందుకు సింగరేణి సంస్థ తెలంగాణలో ఉన్న తమ వర్క్‌ షాపులను సైతం మూసివేసి కార్మికులను గోల్డెన్‌ హ్యండ్‌షేక్‌ల పేరుతో రిటైర్‌ మెంట్‌కు గురిచేసింది. మ్యాన్‌రైడింగ్‌ మెటీరియల్‌, బెల్ట్‌కన్వేయర్లు, హల్లర్లు, జంబోడ్రీల్స్‌, రూఫ్‌బోల్ట్‌లు, కన్వేయర్‌ రోలర్స్‌ తదితర యంత్రాలను ఆఫ్మెల్‌లో ఉత్పత్తులు చేస్తూ ఏటా రూ.50 కోట్ల విలువైన ఆర్డర్లను ఇస్తూ ఆఫ్మెల్‌ను పోషిం చింది. అంతేగాక కోల్‌ఇండియా అనుబంధ బొగ్గు ఉత్పాదక సంస్థలకు సైతం అవ సరమైన యంత్రాలు, పరికరాలను ఆఫ్మెల్‌లో తయారుచేయించి ఎగుమతి చేస్తూ ఆ కంపెనీకి జవసత్వాలు సమకూర్చితే నేడు ఏకంగా సింగరేణిలో వాటాల కోసం ఏపీ ప్రభుత్వం డిమాండ్‌ చేయడం సమంజసంకాదన్న వాదనలు వినిపిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి సమావే శంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Updated Date - 2022-01-12T05:00:41+05:30 IST