Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్మీ జవాన్ మృతి

శ్రీకాకుళం: అస్సాంలో జరిగిన ప్రమాదంలో జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ మృతి చెందాడు. సిక్కోలుకు చెందిన రామారావు అస్సాంలో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో విధుల నిర్వహణ కోసం రామారావుతో పాటు మరికొంత మంది జవాన్లు ఆర్మీ వాహనంలో వెళుతున్నారు. అయితే మంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించక రామారావు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో రామారావు మృతి చెందాడు. రామారావుది శ్రీకాకుళం పట్టణంలోని ఇల్లిసుపురం. జవాన్ రామారావు మృతి చెందిన విషయం ఆర్మీ అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. 

Advertisement
Advertisement