Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరుణార్చన అభిషేకానికి ఏర్పాట్లు

ఇబ్రహీంపట్నం: డిసెంబర్‌ ఒకటిన ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో  శ్రీ వరుణార్చన అభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఆరోజు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వేద పండితులైన బ్రాహ్మణోత్సములు, రుత్విక్కులతో ఈ మహాహోమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదట ఈనెల 22వ తేదీన ఈ హోమం నిర్వహించాలని తలపెట్టినప్పటికీ నాలుగు రోజులపాటు కురిసిన ముసురు వల్ల తాత్కాలింగా వాయిదా వేశారు. ఈ ప్రాంతంలో చెరువులు నిండినందున పదేళ్ల క్రితం వర్షాలకోసం శ్రీ మహా వరుణయాగం నిర్వహించిన స్థలంలోనే అభిషేక హోమం నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల నుంచి భక్తులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు. 

Advertisement
Advertisement