ఇద్దరు నకిలీ విలేకరుల ఆరెస్ట్

ABN , First Publish Date - 2021-07-28T03:46:24+05:30 IST

జిల్లాలో ఇద్దరు నకిలీ విలేకరులను పోలీసులు అరెస్ట్ చేశారు. నూజివీడులో

ఇద్దరు నకిలీ విలేకరుల ఆరెస్ట్

కృష్ణా: జిల్లాలో ఇద్దరు నకిలీ విలేకరులను పోలీసులు అరెస్ట్ చేశారు. నూజివీడులో మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ఇద్దరు నకిలీ విలేకరులను  పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. నూజివీడుకు చెందిన మహిళకు నకిలీ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ తయారు చేసి వలంటీర్ ఉద్యోగాన్ని ఇద్దరు పత్రికా విలేకరులు ఇప్పించారు. ఉద్యోగం ఇప్పించినందుకు కొంత నగదు తీసుకుని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఇరువురు విలేకరులపై జిల్లా ఎస్పీకి భాదితురాలు ఫిర్యాదు చేసింది. నిందుతులను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.  

Updated Date - 2021-07-28T03:46:24+05:30 IST