ఈ నెల 22న అసదుద్దీన్‌ రెండో కుమార్తె వివాహం

ABN , First Publish Date - 2020-09-19T11:46:57+05:30 IST

ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ రెండో కుమార్తె వివాహం ఈ నెల 22న జరగనుంది. కొవిడ్‌ నేపథ్యంలో కేవలం...

ఈ నెల 22న అసదుద్దీన్‌ రెండో కుమార్తె వివాహం

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ రెండో కుమార్తె వివాహం ఈ నెల 22న జరగనుంది. కొవిడ్‌ నేపథ్యంలో కేవలం ఇరు కుటుంబీకుల సమక్షంలోనే ఈ పెళ్లి జరగనుందని సమాచారం. వివాహ విషయం అందరికీ తెలిపినప్పటికీ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఇంట్లో ఉండి వధూవరులను ఆశీర్వదించాలని పెండ్లి పత్రికలో కోరారు. ప్రముఖ ఉర్దూ పత్రిక సియాసత్‌ చీఫ్‌ ఎడిటర్‌ జాహెద్‌ అలీఖాన్‌ బంధువు, ఒవైసీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మజ్హర్‌ కుమారుడు డాక్టర్‌ ఆబిద్‌ అలీఖాన్‌తో ఈ నెల 22న శాస్ర్తీపురంలోని అసదుద్దీన్‌ ఇంట్లో నిఖా, ఈ నెల 25న రిసెప్షన్‌ (వలీమా) జరగనుంది. అయితే దీనికి సంబంధించి అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానించిన ఇరు కుటుంబీకులు మిగతా వారిని ఇంట్లో ఉండే ఆశీర్వదించాలని కోరారు.

Updated Date - 2020-09-19T11:46:57+05:30 IST