మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం
ABN , First Publish Date - 2021-04-01T16:57:36+05:30 IST
జిల్లాలోని మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం జరిగింది. అవనిగడ్డ మండలంలోని
కృష్ణా: జిల్లాలోని మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం జరిగింది. అవనిగడ్డ మండలంలోని తుంగలవారిపాలెం గ్రామ మాజీ సర్పంచ్ వెంకట చలపతిరావు పై ప్రత్యర్థులు హత్యాయత్నం చేశారు. భూ సరిహద్దు వివాదంలో సమీప బంధువు కత్తితో ఆయన పై దాడి చేశాడు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చలపతిరావును మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.