ఆసుస్‌ నుంచి జెన్‌ఫోన్‌ 7

ABN , First Publish Date - 2020-08-22T19:48:55+05:30 IST

మొబైల్‌ ప్రియులను ఆకట్టుకోవడానికి కంపెనీలు సరికొత్త ఫీచర్లతో ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అదే కోవలో ఆసుస్‌ జెన్‌ఫోన్‌ 7 పేరుతో ఓ కొత్త మొబైల్‌ను విడుదల

ఆసుస్‌ నుంచి జెన్‌ఫోన్‌ 7

మొబైల్‌ ప్రియులను ఆకట్టుకోవడానికి కంపెనీలు సరికొత్త ఫీచర్లతో ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అదే కోవలో ఆసుస్‌ జెన్‌ఫోన్‌ 7 పేరుతో ఓ కొత్త మొబైల్‌ను విడుదల చేస్తోంది. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ మొబైల్‌ 6.4 అంగుళాల ఐపీఎస్‌ డిస్‌ప్లేతో అలరించనుంది. 20 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరా నాణ్యమైన సెల్ఫీలకు పనికొస్తుంది. 64 మెగాపిక్సెల్‌ + 13 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరాలు డిజిటల్‌ జూమ్‌, అటో ఫోకస్‌, ఫేస్‌ డిటెక్షన్‌, టచ్‌ టు ఫోకస్‌ వంటి ఫీచర్లతో ఆకట్టుకోనున్నాయి. ఫ్లిప్‌ కెమెరా మాడ్యూల్‌ ఉండే అవకాశం ఉంది. 5000 ఎంఎహెచ్‌ బ్యాటరీ పనితీరు, 6జిబి ర్యామ్‌, 128 జిబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సామర్థ్యం వినియోగదారులను మెప్పించే అవకాశం ఉంది. ఆగస్టు 26న మార్కెట్లోకి విడుదల కానుంది.

Updated Date - 2020-08-22T19:48:55+05:30 IST