రేపు తిరుపతికి అచ్చెన్న రాక.. బహిరంగ సభ
ABN , First Publish Date - 2021-01-19T14:06:08+05:30 IST
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం తిరుపతికి రానున్నారు.
తిరుపతి : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం తిరుపతికి రానున్నారు. ఆయన పర్యటనను జయప్రదం చేయాలని సోమవారం జరిగిన సమావేశంలో టీడీపీ సమన్వయ కమిటీ నిర్ణయించింది. బుధవారం ఆయన తిరుపతి పార్లమెంట్ కార్యాలయాన్ని ప్రారంభించాక, గూడూరులో జరిగే పనబాక లక్ష్మి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. 21వతేదీ అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ప్రచార రథాలతో ర్యాలీ నిర్వహించనున్నారు.
టౌన్‌క్లబ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి బహిరంగ సభలో అచ్చెన్నాయుడు ప్రసంగించను న్నారు. ఈ ఏర్పాట్లపై చర్చించిన సమావేశంలో నాయకులు సుగుణమ్మ, బత్యాల చెంగల్రాయులు, నరసింహయాదవ్, బీఎల్ సంజయ్, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, సుధాకర్ రెడ్డి, ఆర్సీ మునికృష్ణ, పుష్పావతి, బ్యాంకు శాంతమ్మ, బుల్లెట్ రమణ, మస్తాన్ నాయుడు, కోడూరు బాలసుబ్రమణ్యం, ఊట్ల సురేంద్ర నాయుడు, సింధూజ తదితరులు పాల్గొన్నారు.