Abn logo
Jan 19 2021 @ 07:00AM

హర్యానాలో దారుణం...

ఏడేళ్లుగా కుమార్తెపై తండ్రి అఘాయిత్యం

హిస్సార్ (హర్యానా): హర్యానా రాష్ట్రంలో దారుణం వెలుగుచూసింది. 17 ఏళ్ల కన్న కూతురిపైనే ఏడేళ్లుగా అత్యాచారం చేస్తూ పలు సార్లు గర్భస్రావం చేయించిన కిరాతక తండ్రి బాగోతం హర్యానా రాష్ట్రంలోని హిసార్ నగరంలో వెలుగుచూసింది. సభ్య సమాజానికి తీరని మచ్చలా మిగిలిన ఈ దారుణ ఘటన సంచలనం రేపింది. హిస్సార్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. తన తండ్రి తనపై ఏడేళ్లుగా అత్యాచారం చేస్తూ పలు సార్లు గర్భస్రావం చేయించాడని 17 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ప్రతిఘటిస్తే చంపేస్తానని బెదిరించాడని బాలిక తండ్రిపై ఫిర్యాదు చేసింది. తాను పలుసార్లు గర్భం దాల్చడంతో గర్భస్రావం చేయించాడని బాలిక పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. తన తండ్రి 11 ఏళ్ల వయసుగల సోదరిని కూడా వేధించాడని బాలిక ఫిర్యాదులో వెల్లడించింది. బాలిక ఫిర్యాదు ఆధారణంగా పోలీసులు కిరాతక తండ్రిపై ఐపీసీ సెక్షన్ 376 (2), 376(2)ఎఫ్, 506, 323, 354ఎ(1) ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. బాధిత బాలికను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement
Advertisement