ఆలయాలపై దాడులు సరికాదు

ABN , First Publish Date - 2021-01-18T08:13:18+05:30 IST

మతాలు వేరైనా దేవుడు ఒక్కడే అని త్రిదండి చిన జీయర్‌ స్వామి అన్నారు. దాడులకు గురైన ఆలయాల సందర్శనలో భాగంగా అహోబిలం పీఠాధిపతి రామానుజ జీయర్‌ స్వామితో కలిసి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో పర్యటించారు.

ఆలయాలపై దాడులు సరికాదు

ఆలయ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి

చినజీయర్‌, రామానుజ జీయర్‌ స్వామిల పిలుపు

మంత్రాలయంలో పర్యటన.. లక్ష విరాళం అందజేత


మంత్రాలయం, జనవరి 17: మతాలు వేరైనా దేవుడు ఒక్కడే అని త్రిదండి చిన జీయర్‌ స్వామి అన్నారు. దాడులకు గురైన ఆలయాల సందర్శనలో భాగంగా అహోబిలం పీఠాధిపతి రామానుజ జీయర్‌ స్వామితో కలిసి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో పర్యటించారు. మంత్రాలయం మండలం వగరూరు గ్రామంలో ధ్వంసమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని వారు సందర్శించారు. ఆలయ ధర్మకర్తలతో మాట్లాడారు. ఆలయ పునర్నిర్మాణం కోసం చిన జీయర్‌ స్వామి రూ.లక్ష విరాళం అందించారు. స్వామి వెంట వచ్చిన పలువురు భక్తులు తమవంతుగా విరాళాలు ఇచ్చారు. గంట వ్యవధిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి రూ.20 లక్షలకుపైగా నిధులు సమకూరాయి. చిన జీయర్‌ స్వామి మాట్లాడుతూ.. అన్ని మతాల సారం ఒక్కటేనని, దేవుడిని వివిధ రూపాల్లో ఆరాధించినా.. ఆయన ఒక్కడేనని అన్నారు. దేవాలయాలను నిర్మించిన తరువాత వాటి భద్రతకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మతాలను, కులాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని అన్నారు. అనంతరం ఆలయాల పరిరక్షణపై ధర్మకర్తలకు, గ్రామ పెద్దలకు సూచనలు చేశారు.


గ్రామానికి చెందిన విశ్వనాథ్‌రెడ్డి రూ.రెండు లక్షలు, కర్నూలు చెందిన పార్థసారథి రూ.లక్ష, వగరూరు మాజీ సర్పంచ్‌ రామిరెడ్డి రూ.50 వేలు ఆలయానికి విరాళాలు ఇచ్చారు. కాగా, రాఘవేంద్రస్వామి మూల బృందావనం దర్శనార్థం త్రిదండి చిన జీయర్‌ స్వామి, అహోబిలం మఠం పీఠాధిపతి రామానుజ జీయర్‌ స్వామి ఆదివారం మంత్రాలయానికి వచ్చారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మదేవిని దర్శించుకున్నారు. మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు స్వామి వారి శేషవస్త్రాలు, జ్ఞాపిక, పరిమళ ప్రసాదం ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు మాట్లాడుతూ.. ఆలయాల పరిరక్షణకు కలిసికట్టుగా పాటుపడాలని కోరారు. ఆలయాలపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 


ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. అంతర్వేది ఘటనపై దర్యాప్తు చేయాలని కేంద్ర విచారణ సంస్థ సీబీఐకి అప్పగించి 4 నెలలు గడిచాయన్నారు. ఇప్పటి వరకూ తప్పు చేసిందెవరో ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ, కేంద్రం 4 నెలలుగా గాడిదలు కాస్తున్నాయా అంటూ మంత్రి మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పేరిట సమావేశమైన బీజేపీ కోర్‌ కమిటీ చర్చిస్తున్న అంశాలను ఆయన తప్పు పట్టారు. ‘‘తిరుపతి ఉప ఎన్నికల్లో బైబిలుకూ, భగవద్గీతకూ మధ్య పోటీ అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. క్రైస్తవులనూ, హిందువులనూ విడదీసి మాట్లాడతారా? హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. అలాంటి వ్యక్తితో  పొత్తు పెట్టుకున్న బీజేపీ... హిందువుల గురించి మాట్లాడుతుందా? చంద్రబాబుతో కలసి ఐదేళ్లలో 40 దేవాలయాలు కూల్చినప్పుడు హిందుత్వ గుర్తుకు రాలేదా? చీప్‌ పాలిటిక్స్‌ను పెట్టుకుని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామంటారా? చేసుకోండి. సాక్ష్యాధారలు చూపించుకోండి. మేం ఎవరికీ భయపడం’’ అని మంత్రి తేల్చి చెప్పారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు చంద్రబాబు జూమ్‌ యాప్‌లో మాట్లాడుతున్నాడన్నారు. చంద్రబాబుకు దేవుడంటే భయమూ భక్తీ లేవని వెలంపల్లి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-01-18T08:13:18+05:30 IST